రోబోటిక్ టెక్నాలజీలతో క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు

రోబోటిక్ టెక్నాలజీలతో క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు

 

మహబూబ్ నగర్, జూన్ 18 ( బ్యూరో ) : క్యాన్సర్ చికిత్స రంగంలో గత దశాబ్ద కాలంగా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, రోబోటిక్ సర్జరీ మరియు ఫ్లోరోసెన్స్ గైడెడ్ సర్జరీ వంటి ఆధునిక సాంకేతికతలు రోగులకు మరింత సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్సను అందిస్తున్నాయని Dr. Rajesh Goud తెలిపారు.హైదరాబాద్‌లోని Yashoda Hospitals Hitec City యూనిట్‌లో ఆయన మాట్లాడుతూ, గతంలో క్యాన్సర్ శస్త్రచికిత్సల ప్రధాన లక్ష్యం కేవలం వ్యాధిని తొలగించడం మాత్రమే కాగా, ప్రస్తుతం రోగికి మెరుగైన జీవన నాణ్యతను అందిస్తూ పూర్తి నయం చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు..పెద్ద కోతలు లేకుండా కేవలం 8 మిల్లీమీటర్ల చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్స చేయడం వల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్తనష్టం, చిన్న మచ్చలు, వేగవంతమైన కోలుకునే అవకాశం ఉంటుందని వివరించారు.మహిళల క్యాన్సర్లలో, ముఖ్యంగా గర్భాశయ మరియు అండాశయ క్యాన్సర్ల చికిత్సలో రోబోటిక్ సర్జరీ అత్యుత్తమ ఫలితాలను ఇస్తోందన్నారు. రాడికల్ హిస్టరెక్టమీ, లింఫ్ నోడ్ డిసెక్షన్ వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలను సురక్షితంగా నిర్వహించవచ్చని తెలిపారు. గతంలో నాలుగు నుంచి ఐదు రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేదని, ప్రస్తుతం చాలామంది రోగులను 24 గంటల్లోనే డిశ్చార్జ్ చేయగలుగుతున్నామని చెప్పారు.

రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఫ్లోరోసెన్స్ గైడెడ్ టెక్నాలజీ కొత్త అవకాశాలను తెరచిందన్నారు. ప్రత్యేక డై సహాయంతో క్యాన్సర్ ప్రభావితమైన సెంటినెల్ లింఫ్ నోడ్స్‌ను గుర్తించి, అవసరమైన వాటిని మాత్రమే తొలగించవచ్చని వివరించారు. దీని వల్ల చేతి వాపు, నొప్పి, ఇతర సమస్యలు గణనీయంగా తగ్గి రోగుల జీవన నాణ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.ప్రోస్టేట్, బ్లాడర్, కిడ్నీ, అడ్రినల్ ట్యూమర్ల చికిత్సలో కూడా రోబోటిక్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. ముఖ్యంగా ప్రోస్టేట్, బ్లాడర్ క్యాన్సర్లలో నరాలను కాపాడే విధంగా శస్త్రచికిత్స నిర్వహించడం ద్వారా మూత్ర నియంత్రణ, ఇతర శారీరక విధులను మెరుగ్గా సంరక్షించవచ్చని తెలిపారు.కిడ్నీ క్యాన్సర్లలో రోబోటిక్ సర్జరీ ద్వారా ట్యూమర్ ఉన్న భాగాన్ని మాత్రమే తొలగించి మిగిలిన ఆరోగ్యకరమైన కిడ్నీని కాపాడే ‘పార్షియల్ నెఫ్రెక్టమీ’ ఎక్కువగా చేయగలుగుతున్నామని, దీంతో పూర్తి కిడ్నీ తొలగించాల్సిన అవసరం తగ్గి క్యాన్సర్ నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని డా. రాజేష్ గౌడ్ వివరించారు.